నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్4
అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం గింజల్ని నీటిపాలు చేశాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తన కళ్లెదుటే నీటిపాలైన తీరుని చూసి రైతన్నలు కంటతడి పెట్టారు. గురువారం అర్ధరాత్రి లో పడిన అకాల వర్షం.గాలి వల్ల ఊహించని నష్టం వాటిల్లింది. నేరేడుచర్ల మండల పరిధిలోని పెంచికల్ దీన్ని గ్రామంలో దాదాపుగా 100 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన కౌలు రైతు అలవాల శ్రీధర్ తన 25 ఎకరాల చివరి దశ పంట నేలమట్టం కావడంతో ఖరీఫ్ సీజన్ ఆశలు ఆవిరైపోయాయి. అసలే వర్షాలు లేక పంటలు పండించుకునేందుకు బావులు బోర్ల సహాయంతో కష్టపరి ఎలాగోలా గట్టెక్కే సమయాన … పెండెం హరిబాబు .. రాచూరి సురేష్.. శేఖర్ ..నవీన్, పెంచికెళ్లి గ్రామం తోపాటు మండలంలోని ఇతర గ్రామాల్లో నీ రైతులు.. కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి సహాయం అందేలా చూడాలని రైతుల కోరుతున్నారు.