కేకే మీడియా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల డిసెంబర్ 6
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలోని నరసయ్య గూడెంలో బుధవారం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న నుకపంగ సైదులు కుటుంబానికి 36 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.