సూర్యపేట క్రైమ్ కేకే మీడియా అక్టోబర్ 26:
అంతరాష్ట్ర ఘరానా మోసగాడిని సూర్యాపేట టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా గొడుగు పేట నివాసి విన్నకోట సాయికుమార్ ఆంధ్రప్రదేశ్లోని పడమట, నున్న, కృష్ణలంక అమలాపురం మండపేట గాజువాక వైజాగ్ రూరల్ తాడేపల్లిగూడెం గుడివాడ నందిగామ భీమవరం ఆలమూరు ధవలేశ్వరం మాచవరం పెంటపాడు పామర్రు అరండల్ పేట అద్దంకి తెలంగాణలోని ఖమ్మం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఓఎల్ఎక్స్ లో పెట్టిన మోటార్ సైకిల్ కొంటానని నమ్మించి మోటార్ సైకిల్ ఆర్సి తో ట్రైయల్ అని వెళ్లి దొంగతనాలు చేస్తూ , రాపిడో మోటార్ సైకిల్ ను బుక్ చేసుకుని జనగామ వరకు వచ్చే క్రమంలో సూర్యాపేట లో డ్రాప్ చేయమని ఒప్పించి సూర్యాపేటకు రాగానే కొత్త బస్టాండ్ వద్ద మెడికల్ షాప్ వద్ద దిగి పారిపోతూ సూర్యపేట పోలీసులకు చిక్కగా నిందితుడిని విచారించగా బొంగులూరు, ఇబ్రహీంపట్నం, యాదగిరి గుట్టలలో కూడా ఇలానే నేరాలు చేసినట్లు సిఐ రాజశేఖర్ తెలిపారు.
కేసును చేదించడం లో ఎస్సై గోపికృష్ణ కుశలవ హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్ కృష్ణ సైదులు శివ మదులను అభినందించారు. నిందితుని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు