నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 1
అంతరాష్ట్ర దొంగగా గుర్తింపు పొంది పలు దొంగతనాల్లో నేరస్తుడుగా ఉన్న నేరేడుచర్లకు చెందిన శ్రీరామదాసు జగన్ ను నేరేడుచర్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు
హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
నేరేడుచర్లకు చెందిన అంతరాష్ట్ర దొంగగా పేరుందిన పాత నేరస్థుడు జగన్ చెడు వ్యసనాలకు బానిసై పలు దొంగతనాలకు పాల్పడుతూ బుధవారం నాడు నేరేడుచర్ల పోలీసులు అరెస్టు చేయగా ఈ మధ్యకాలంలో జరిగిన పలు దొంగతనాల్లో రెండు లక్షల రూపాయల విలువగల ఆభరణాలను స్వాధీనం చేసుకోగా గతంలో ఎల్బీనగర్ ఖమ్మం నేరేడుచర్ల మిర్యాలగూడ వనస్థలిపురం చైతన్యపురి కొవ్వూరు తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నేరస్తుడుగా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఐదు నెలల క్రితం హైదరాబాద్ వనస్థలిపురం ఒక ఇంట్లో దొంగతనంలో పట్టు పడగా రెండు నెలలు జైలు జీవితం గడిపి బేల్ పై తిరిగి వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూ నేరేడుచర్ల లోని ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డ కేసులో అరెస్టు కాబట్టి నేడు రిమాండ్కు తరలించపడినాడు.