నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 26
నేరేడుచర్లలోని అంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రావణమాసం సందర్భంగా శనివారం నాడు బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పాఠశాలలో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్ధినిలు బోనమెత్తగా మేళ తాళాలతో ఊరేగింపుగా నేరేడుచర్ల ప్రధాన వీధులలో ఊరేగింపుగా నృత్యాలతో కోలాట, డబ్బు వాయిద్యాలతో ప్రదక్షణ నిర్వహించారు.
వేద పండితులు అన్నంబొట్ల ఫణి కుమార శర్మ చేపట్టిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అలక సైదిరెడ్డి , కౌన్సిలర్ అలక సరిత, పాఠశాల డైరెక్టర్ సుంకర క్రాంతి కుమార్, న్యాయవాది సుంకర ప్రదీప్తి అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.