నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 4
పోషణ మాసంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం అంగన్వాడి కేంద్రాలలో “రీడ్ -ఎ-తోన్ 2024” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ ప్రీతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ప్రీస్కూల్ పిల్లలకు చదవడం,రాయడం రావాలంటే పుస్తకాలు పిల్లలకు ఇచ్చి వారితో పెయింటింగ్ వేయించడం, చదివించడం చేయాలన్నారు. పుస్తకాలను జాగ్రత్తపరచుకోవటానికి ప్రతి పిల్లవానికి ప్రొఫైల్ బ్యాగ్ ఉండాలన్నారు.ఈ సెప్టెంబర్ నెల రోజులు షెడ్యూల్ ప్రకారం అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాస కార్యక్రమం నిర్వహిస్తు నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు,చింతమల్ల ప్రీతి, వాస అన్నమ్మా ఆయాలు,పిల్లల తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.