పాలకీడు కేకే మీడియా మార్చి 28:
బొత్తలపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు1,2, ఆధ్వర్యంలో పోషణ పక్వాడ వారోత్సవాలు భాగంగా మన ఊరు- మన పోషణ– మన ఆరోగ్యం కార్యక్రమాన్ని తల్లులు గర్భిణులు బాలింతలు పిల్లలతో నిర్వహించారు
కార్యక్రమంలో పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ప్రదర్శించడం జరిగింది కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భోగాల వీరారెడ్డి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వాలు గర్భిణులకు బాలింతలకు 0–5 సంవత్సరాల పిల్లలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారని మీరంతా ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు
ఐసిడిఎస్ పాలకవీడు సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ మనం ప్రతిరోజు పోషకాలతో కూడిన సమతుల్య భోజనంలో భాగంగా మినుములు రాగులు సజ్జలు మంచి సెనగలు జొన్నలు మొదలగునవి ఒక పూట భోజనం లో ఉండే విధంగా చూసుకోవాలని ఆమె సూచించారు అదేవిధంగా ఆకుకూరలు పాలు గుడ్లు తదితర వాటిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని వాటిని మనం ఆహారంలో తీసుకోవాలని కోరారు పోషక విలువలతో సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు మరియు రక్తహీనత దృఢంగా లేకపోవడం జరుగుతుందని ఆమె అన్నారు కావున పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఎస్ ప్రేమలత డి జానకమ్మ విజయలక్ష్మి దీపిక ధనలక్ష్మి మరియు గ్రామ పెద్దలు కందగట్ల అనంత ప్రకాష్ కీతా శ్రీనివాస్ సంఘమిత్ర C. C లు కందుల సుజాత ఎల్లయ్య సంఘమిత్ర అధ్యక్షులు బొమ్మ కంటి అరుణ కందగట్ల భానుమతి వి బి కే లు తిప్పిరి శెట్టి శైలజ సుందరి నాగమణి లక్ష్మణ్ మరియు తల్లులు గర్భిణులు బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు